అణ్వాయుధాల కోసం పాక్‌ చట్టవ్యతిరేక మార్గం

హెచ్చిరించిన జర్మనీ నిఘా సంస్థ

German intelligence agency
German intelligence agency

జర్మనీ: పాకిస్థాన్‌ జీవ, రసాయనిక, అణ్వాయుధాల కోసం వక్ర మార్గాన్ని ఎంచుకుందని జర్మనీ నిఘా సంస్థ 2018లోనే తన నివేదికలో హెచ్చిరించింది. చట్టవ్యతిరేక మార్గాల్లో జీవ, రసాయనిక, అణ్వాయుధాలనకు పోగేసుకునేందుకు పాక్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని జర్మీనీ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కాగా జర్మనీ, ఇతర పాశ్చాత్య దేశాల నుంచి అక్రమమార్గాల్లో అణ్వాయుధాలు సంపాదించేందుకు పాక్ గత కొద్ది సంవత్సరాలుగా తన ప్రయాత్నాలను ముమ్మరం చేసిందని సదరు సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. జర్మనీలో అనేక అత్యాధునికి టెక్ కంపెనీలు ఉండటంతో దేశభద్రతపై సదరు చట్ట సభ సభ్యలు ప్రశ్నించగా ఇందుకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/