భారత ఆర్మీ చీఫ్‌ వ్యాఖ్యలపై స్పందించిన ఇమ్రాన్‌ ఖాన్‌

Imran Khan
Imran Khan

ఇస్లామాబాద్‌: భారత ఆర్మీ ఛీఫ్‌ బిపిన్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ స్పందిచారు. అవసరమైన ప్రతీసారి పాక్‌ భారత్‌పై విషం చిమ్మడం పరిపాటిగా పెట్టుకుంది కాబోలు. దేశంలో పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రజల దృష్టి మరల్చేందుకు భారత ఆర్మీ కోవర్టు ఆపరేషన్లు చేసి పాక్‌పై నిందలేసే ఆస్కారం లేకపోలేదని ఇమ్రాన్‌ ట్వీట్‌ చేశారు. భారత ఆర్మీ ఛీఫ్‌ చేసిన వ్యాఖ్యలను ఇమ్రాన్‌ ఈ సందర్బంగా ప్రస్తావించారు. భారత్‌లో సిఎఎపై నిరసన సెగలు ఉదృతమవుతున్నాయి. దీనివల్ల పాక్‌ ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది. భారత ఆర్మీ ఛీఫ్‌ చేసిన వ్యాఖ్యలు ఆందోళనను కలిగిస్తున్నాయి. తాను అంతర్జాతీయ సమాజాన్ని ముందు నుంచే హెచ్చరిస్తూ ఉన్నానని, భారత్‌ ఇటువంటి ఆపరేషన్లు చేపడితే, పాకిస్థాన్‌ కూడా దీటుగా బదులు చెప్తుంది అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. మరోవైపు ఎల్‌ఓసీ సరిహద్దు వెంబడి కొంత మేర కంచెను భార ఆర్మీ తొలగించిందనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే భారత్ ఆర్మీ ఈ వార్తలను తోసిపుచ్చింది. ఇదంతా పాక్ చేస్తున్న విషప్రచారమంటూ కొట్టి పారేసింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/