నియంత్రణ రేఖ వద్ద పర్యటించిన ఇమ్రాన్ ఖాన్


ఇమ్రాన్ వెంట ఆర్మీ చీఫ్ పలువురు మంత్రులు

Imran khan - Army Staff
Imran khan – Army Staff

ఇస్లామాబాద్‌: ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్పాకిస్థాన్ ల మధ్య ఉద్రికత్తలు తీవ్ర రూపం దాల్చాయి. ఇలాంటి తరుణంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా, రక్షణ మంత్రి పర్వేజ్ ఖట్టక్, విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషీ, కశ్మీర్ ప్రత్యేక కమిటీ ఛైర్మన్ సయ్యద్ ఫకర్ ఇమామ్ ఉన్నారు. పాకిస్థాన్ రక్షణ మరియు అమరవీరుల దినోత్సవాన్ని పూరస్కరించుకుని ఎల్వోసీ వద్ద వీరు పర్యటించారు. సరిహద్దుల వద్ద భారత్ నుంచి ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పాక్ సైనికబలగాలు సిద్ధంగా ఉండాలని కొన్ని రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. ఆ సందర్భంలోనే నియంత్రణ రేఖ వద్ద పర్యటించాలని ఇమ్రాన్ నిర్ణయించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/