బాలాకోట్‌కు పాక్‌ నుంచి విదేశీ జర్నలిస్టులు

Foreign Diplomats
Foreign Diplomats


న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు బాలాకోట్‌లో ఉన్న ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన విషయం విదితమే. ఐతే పాకిస్థాన్‌ మాత్రం తమకు ఎటువంటి నష్టం కలగలేదంటున్నది. తమ వాదనను నిరూపించేందుకు పాకిస్థాన్‌ ఇవాళ కొందరు విదేశీ జర్నలిస్టులను బాలాకోట్‌కు తీసుకువెళ్లింది. బాలాకోట్‌లో ఎటువంటి నష్టం జరగలేదని ఆ దేశ మిలిటరీ పేర్కొన్నది. బాలాకోట్‌లోని ఓ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న విదేశీ జర్పలిస్టుల ఫోటోను ఆ దేశ మిలిటరీ ట్వీట్‌ చేసింది. భారత్‌ మాత్రం బాలాకోట్‌లోని జైషే ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు చెప్పుకుంటున్నది.

తాజా హీరోల ఫోటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/