హై కమిషన్‌ర్‌ను వెనక్కి పిలిపించిన పాక్‌

Sohail Mahmood
Sohail Mahmood

ఇస్లామాబాద్‌: పుల్వామా దాడితో పాక్‌, భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసందర్భంగా భారత్‌లోని పాక్‌ హైకమిషనర్‌ను పాక్‌ స్వదేశానికి పిలిచింది. తాజా పరిస్థితులపై చర్చించేందుకునే హై కమిషనర్‌ను పిలిచినట్లు పాక్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈరోజు ఉదయం ఆయన ఢిల్లీ నుంచి బయల్దేరారుగ అని పాక్‌ విదేశాంగ ప్రతినిధి మహ్మద్ ఫైజల్‌ తెలిపారు. పుల్వామా దాడి నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖల్‌ గత శుక్రవారం పాక్‌ హై కమిషనర్‌ సొహైల్‌ మహ్మద్‌కు సమన్లు జారీ చేశారు.