పెరిగిపోతున్న పాకిస్థాన్‌ అప్పులు

Imran Khan
Imran Khan

ఇస్లామాబాద్‌: కాశ్మీర్‌ విషయాన్ని రాద్ధాంతం చేస్తూ భారత్‌ను విమర్శిస్తున్న పాకిస్థాన ఆర్ధిక పరిస్థితి రోజురోజుకు మరింత దిగజరుతోంది. పాకిస్థాన్‌లో అప్పులు పేరుకుపోయాయి. అప్పులకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ మీడియా దేశ ఆర్థిక పరిస్థితిపై ఒక నివేదికను ప్రధానికి సమర్పించింది. దేశం అప్పులు బాగా పెరిగిపోయినట్లు నివేదిక వెల్లడించింది. ఈ మేరకు పాకిస్థాన్‌ మీడియా దేశ ఆర్థిక పరిస్థితిపై కొన్ని కథనాలు కూడా రాసింది. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ డేటా ప్రకారం ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు రూ.7 లక్షల కోట్లు రుణంగా తీసుకుంది. 2018 ఆగస్టు నుంచి 2019 ఆగస్టు వరకు విదేశీ వనరుల ద్వారా రూ.2,80,400 కోట్లు అప్పు చేసింది. మరో రూ.4,70, 500 కోట్లు స్వదేశీ వనరుల ద్వారా తీసుకుంది. పాకిస్థాన్‌లో ఇంతకుముందున్న ఏ ప్రభుత్వాలు కూడా ఇంత భారీమొత్తంలో అప్పులు తీసుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వ రుణం రూ.32,24,000 కోట్లకు చేరింది. ఇమ్రాన్‌ అధికారంలోకి రాకముందు పాకిస్థాన్‌ రూ.24,73, 200 కోట్లు అప్పు ఉండేది. ప్రస్తుత తొలి ఆర్థిక త్రైమాసికానికి పాకిస్థాన్‌ రూ.1లక్ష కోట్ల మేర పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని రూ.96,000 కోట్లు వసూలు చేయగలిగింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/