మిడతలపై పాకిస్థాన్‌ పోరాటం

అధికారులతో ఇమ్రాన్‌ ఖాన్‌ అత్యవసర సమావేశం

Imran Khan
Imran Khan

ఇస్లామాబాద్‌: పొలాలపై పడి పంటలను సర్వనాశనం చేస్తున్న మిడతలపై పోరాడేందుకు పాకిస్థాన్ జాతీయ అత్యయిక పరిస్థితిని విధించింది. అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతులను మిడతల సమస్య నుంచి బయట పడేసేందుకు తక్షణం 730 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఎన్ఏపీ (నేషనల్ ఎమర్జెన్సీ ప్లాన్) విభాగం ఈ నిధులతో మిడతల సమస్యను దూరం చేస్తుందని భావిస్తున్నట్టు ఇమ్రాన్ పేర్కొన్నారు. మరోవైపు పాకిస్థాన్ నుంచి హద్దులు దాటి భారత్ లోకి ప్రవేశిస్తున్న మిడతలు, గుజరాత్ లో సైతం పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయన్న సంగతి తెలిసిందే.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/