పాక్‌లో దైవదూషణ చేస్తే మరణశిక్ష

Pakistan court hands down death
Pakistan court hands down death

ఇస్తామాబాద్‌: పాకిస్తాన్‌లో బహౌద్దీన్‌ జకరీయా అనే యూనివర్సీటీలో జునైద్‌ హఫీజ్‌ అనే వ్యక్తి ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. ఆయన మహ్మద్‌ ప్రవక్తపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు నమోదైంది. 2013లో అతణ్ని పోలీసులు దైవదూషణ నేరం కింద అరెస్టు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ముల్తాన్‌ సెంట్రల్‌ సిటీ కోర్టు ఆయనకు మరణశిక్షను ఖరారు చేస్తూ శనివారం తీర్పు వెలువరించింది. అయితే వర్సిటీలో తన నియామకాన్ని వ్యతిరేకించిన ఓ మత సంస్థతో అనుబంధం ఉన్న విద్యార్థులే తనని ఈ కేసులో ఇరికిరించారని ప్రొఫెసర్‌ హఫీజ్‌ గతంలో తెలిపారు. కాగా హఫీజ్‌ తరపున వాదించడానికి ఒప్పుకున్న తొలి న్యాయవాదిని కోర్టు ఆవరణలోనే దారుణ హత్య చేశారు. అలాగే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడంతో రెండో న్యాయవాది మధ్యలోనే తప్పుకున్నాడు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/