చంద్రయాన్-2 పై పాక్‌ సెటైర్లు

చంద్రయాన్-2పై కారుకూతలు కూసిన పాక్

Fawad Hussain
Fawad Hussain

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. చంద్రయాన్2 ప్రయోగంపై యావత్ ప్రపంచం భారత్, ఇస్రోల పట్ల సానుభూతి వచనాలు పలుకుతుంటే, పాక్ మాత్రం సెటైర్లు వేస్తోంది. చేతకాని పని జోలికి వెళ్లడం ఎందుకు? బొక్కబోర్లాపడడం ఎందుకు? అంటూ పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరీ ట్విట్టర్ లో వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ‘ఎండియా’ (న్థ్ట్చిౖ) అంటూ భారత్ కథ ముగిసింది అనే ధోరణిలో వ్యంగ్యం ప్రదర్శించాడు. దాంతో నెటిజన్లు ఆయనను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ తో ఉక్కిరిబిక్కిరి చేశారు. దాంతో మళ్లీ ట్విట్టర్ లో స్పందించిన ఫవాద్ హుస్సేన్, విఫల ప్రాజెక్టు కోసం రూ.900 కోట్లు ఖర్చు పెట్టమని ఎవరు చెప్పారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ప్రధాని మోదీ తనేదో వ్యోమగామి అయినట్టు ప్రసంగాలు దంచుతున్నాడని వ్యాఖ్యానించారు. అయితే ఈసారి పాకిస్థాన్ నెటిజన్లే మంత్రికి గడ్డిపెట్టారు. ఖిమనకు సాధ్యం కానిది భారత్ చేస్తోందంటే ప్రోత్సహించాలి కానీ, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? దయచేసి పాకిస్థాన్ పరువు తీయొద్దుఖి అంటూ హితవు పలికారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/