సోషల్‌ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసిన దుండగుడు

  ‘unprecedented’ terror attack

gunman opens fire on Christchurch mosques in ‘unprecedented’ terror attack

న్యూజిలాండ్‌: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్స్‌లోని మసీదుల్లో కాల్పులకు తెగబడిన సాయుధుడు కాల్పుల ఘటనను సోషల్‌ మీడియా ద్వారా లైవ్‌స్ట్రీమింగ్‌ చేశాడు. దుండగుడు విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో పలువురు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. మసీదులో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నట్టు ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. దుండగుడు మసీదులోకి వెళ్లడానికి ముందే సోషల్‌ మీడియాలో లైవ్‌స్ట్రీమ్‌ ప్రారంభించాడు. కారులో మసీదుకు చేరుకున్న నిందితుడు లోపలికి ప్రవేశించాడు. అతడి కారులో మారణాయుధాలు పేలుడు పదార్థాలు, పెట్రో లు కేన్లు ఉన్నట్టు న్యూజిలాండ్‌ హెరాల్డ్‌ పేర్కొంది. సాయుధుడు మసీదులోకి వెళ్లిన వెంటనే విక్షణ రహితంగా కాల్పులు జరిపాడని పత్రిక పేర్కొంది. 15 నిమిషాలపాటు కొనసాగిన లైవ్‌ స్ట్రీమింగ్‌లో ఈ మొత్తం వ్యవహారం రికార్డు అయిందని పేర్కొంది. అయితే, ఇందుకు సంబంధించిన విడియోను సామాజిక మధ్యమాల్లో పోస్టు చేయవద్దని పోలీసులు అదేశాలు జారీ చేశారు. అల్‌ నూర్‌ మాస్క్‌లోకి అర్మీ దుస్తులు ధరించిన వ్యక్తి అటోమెటిక్‌ రైఫిల్‌ పట్టుకుని అల్‌నూర్‌ లోపలికి వెళ్లడం తాను చూశానని, అతడు లోపలి వెళ్లిన వెంటనే తుపాకీ అగకుండా మోగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.