పాక్‌ కాల్పులు, జవాను మృతి

encounter
encounter


శ్రీనగర్‌: కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడమే పనిగా పెట్టుకుంది పాకిస్థాన్‌. సరిహద్దులో పాక్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇవాళ తెల్లవారుఝామున పాక్‌ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సైన్యంపై విరుచుకుపడ్డారు. రాజౌరి జిల్లాలోని సుందర్‌ బానీ సెక్టార్‌లో భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్‌ రేంజర్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భారత జవాను ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పాక్‌ కాల్పులను భారత్‌ సమర్థవంతంగా తిప్పికొట్టింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/