అధ్యక్ష ఎన్నికల కోసం భారీగా విరాళాల సేకరణ

Usha Reddy
Usha Reddy


అమెరికా: ఈ ఏడాది జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం భారీ మొత్తంలో విరాళాలు సేకరించినట్టు ప్రవాస భారతీయురాలు, మన్‌ హట్టన్‌ నగర మేయర్‌ ఉషారెడ్డి ప్రకటించారు. తాము సేకరించిన విరాళాలు గురువారం నాటికి 100,000 డార్లకు (రూ.71,19,850) చేరుకున్నాయని తెలిపారు. కన్సాస్‌ సెనెటర్‌ ఆశావహ అభ్యర్థిగా డెమోక్రాటిక్‌ పార్టీ తరపున ఆమె ఎన్నికల బరిలో దిగనున్నారు. మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశం తనకు లేదని రిపబ్లికన్‌ పార్టీ నేత ప్రస్తుత సెనెటర్‌ పాట్‌ రాబర్ట్స్‌ ప్రకటించడంతో, ఉషారెడ్డి పోటీచేస్తున్న కన్సాస్‌లో రిపబ్లికన్‌ పార్టీకి మంచి పట్టు ఉన్నది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/