అణు దౌత్యంపై ఉత్తరకొరియా అధికార పార్టీ సమావేశాలు

kim jang un
kim jang un, north korea president

సియోల్‌ : కొరియా అణు నిరాయుధీకరణ చర్చల విషయంలో అమెరికాకు ఇచ్చిన గడువు దగ్గర పడుతుండటంతో తాజా పరిస్థితిని సమీక్షించేందుకు ఉ.కొరియా అధికార వర్కర్స్‌ పార్టీ కేంద్ర కమిటీ దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సారధ్యంలో భేటీ అయింది. అమెరికా ఆంక్షలతో ఎదురవుతున్న క్లిష్ట పరిస్థితులను ఏ విధంగా అధిగమించాలన్న అంశంపై ఈ భేటీలో విస్తృత చర్చ జరిగినట్లు అధికార మీడియా తన వార్తా కథనాల్లో వెల్లడించింది. అణు చర్చల పునరుద్ధరణకు తమపై విధించిన ఆంక్షలను తొలగించాలని కోరుతూ ఉ.కొరియా ప్రభుత్వం ఈ ఏడాది చివరి వరకూ గడువు విధించిన విషయం తెలిసిందే. తమపై ఆంక్షలను తొలగించిన పక్షంలో అమెరికాతో అణుదౌత్యానికి తెరదించటంతోపాటు, అణు కార్యకలాపాలను పునరుద్ధరించే అంశంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించింది. శనివారం ప్రారంభమైన ఈ ప్లీనరీ సమావేశాలు మరికొద్ది రోజులపాటు జరిగే అవకాశాలున్నాయని, తొలిరోజు పార్టీ ప్రతినిధులనుద్ధేశించి అధ్యక్షుడు ప్రసంగించారని మీడియా తెలిపింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/