రాయబారిని హతమార్చిన ఉత్తరకొరియా

North Korea Envoy Executed
North Korea Envoy Executed

హైదరాబాద్‌: అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్న అధికారిని ఉత్తర కొరియా హత్యమార్చింది. అయితే అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో జ‌రిగిన హ‌నోయి స‌మావేశం విఫ‌లం కావ‌డంతో నార్త్ కొరియా ఈ చ‌ర్య‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి ట్రంప్‌తో జ‌రిగిన హ‌నోయి స‌మావేశానికి గ్రౌండ్ ప్లాన్ చేసింది కిమ్ హ్యాక్ చోల్‌. కిమ్‌తో ప్రైవేటు రైలులో కూడా కిమ్ హ్యాక్ చోల్ ప్ర‌యాణించారు. అయితే సుప్రీం నేత అయిన కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాల‌ను ఉల్లంఘించినందుకు కిమ్ హ్యాక్ చోల్‌ను ఫైరింగ్ స్క్వాడ్ హ‌త‌మార్చిన‌ట్లు తెలుస్తోంది. కాగా మార్చి నెల‌లో కిమ్ హ్యాక్ చోల్‌ను ఫైరింగ్ స్క్వాడ్ హ‌త‌మార్చిన‌ట్లు తెలుస్తోంది. ఓ ద‌ర్యాప్తు నివేదిక ఆధారంగా ఈ చ‌ర్య‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/