కొవిడ్‌-19పై చైనా విజయం..నేడు కొత్త కేసులు లేవు

నేడు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారికంగా ప్రకటించిన చైనా

corona
corona

చైనా: చైనాలో వూహాన్‌లో తొలి కరోనా పాజిటివ్‌తో వెలుగులోకి వచ్చిన ఈవైరస్‌ అప్పటి నుండి రోజురోజుకు వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతునే ఉంది. అయితే కరోనాపై పోరాటంలో చైనా విజయం సాధించింది. ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని చైన్నా అధికారికంగా ప్రకటించింది. దేశంలోని ఏ పౌరుడికీ కరోనా పాజిటివ్ రాలేదని వెల్లడించింది. వూహాన్ లో కొత్త కేసులు లేవని, పాజిటివ్ వచ్చిన వారు కూడా చికిత్స తరువాత ఇళ్లకు వెళుతున్నారని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. కాగా, వూహాన్ లో దాదాపు కోటి మందికి పైగా ప్రజలను, అత్యంత కఠినమైన నిర్ణయాలతో జనవరి 23 నుంచి ఇళ్లకు మాత్రమే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. హుబేయ్ ప్రావిన్స్ ను మూసివేసి, దాదాపు 4 కోట్ల మందిని లాక్ డౌన్ చేసిన చైనా, వారి అవసరాలు తీరుస్తూ, వైరస్ పూర్తిగా చచ్చిపోయేంత వరకూ ఆంక్షలను కొనసాగించింది.

ఇదే సమయంలో చైనాలో నేడు ఎనిమిది మంది వైరస్ కారణంగా మరణించారని, దీంతో మృతుల సంఖ్య 3,245కు చేరిందని కమిషన్ పేర్కొంది. మొత్తం 81 వేల మందికి పైగా ఇన్ఫెక్షన్ సోకగా, ప్రస్తుతం 7,263 మందికి చికిత్స కొనసాగుతోందని పేర్కొంది. చైనాలో కరోనా చికిత్సలు అందించిన ఆసుపత్రులను సైతం మూసివేశారు. ఈ నెల 10న వూహాన్ లో స్వయంగా పర్యటించిన అధ్యక్షుడు జిన్ పింగ్, వైరస్ ను తాము జయించినట్టేనని ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/