పెట్టుబడులకు భారతే అత్యుత్తమం

nirmala-sitharaman-america
nirmala-sitharaman-america

వాషింగ్టన్‌:పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలో భారత్‌ కంటే అనుకూలమైన దేశం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆమె అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదేశీ మదుపరులనుద్దేశించి మాట్లాడుతూ నేటికి అత్యంత వృద్ధిదాయక దేశం భారతే. మా దేశంలో అత్యుత్తమ నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి ఉన్నది అన్నారు. తమ ప్రభుత్వం సంస్కరణలను ఆపబోదని సృష్టం చేశారు. భారత్‌ ఓ స్వేచ్ఛాయుత, పారదర్శక విధానాల దేశమని, అనుమతులకు ఆలస్యం ఉండదని, కాబట్టి పెట్టుబడులతో రావాలని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
అమెరికాభారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య మండలితో కలిసి ఫిక్కీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అంతకుముందు ఫిక్కీతోపాటు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, సిటీ బ్యాంక్‌లతో కలిసి అమెరికాభారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి, సంస్థాగత మదుపరులతో న్యూయార్క్‌లో సమావేశం నిర్వహించింది. బీమా, రుణ పునర్‌వ్యవస్థీకరణ, ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు, ఈక్విటీ మదుపరులు, బ్యాంకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/