యూకే హైకోర్టులో నీరవ్‌మోడి పిటిషన్‌

Nirav Modi
Nirav Modi

లండన్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణం కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడి ప్రస్తుతం లండన్‌లోని ఓ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. నీరవ్‌ మోడిని లండన్‌ పోలీసులు మార్చి 19న అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులో ఉంటున్నారు.అయితే ఆయన ఈరోజు యూకే హైకోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారు. ఆయన పిటిషన్‌పై జూన్‌ 11న విచారణ జరపనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఒకవేళ నీరవ్‌ను భారత్‌కు అప్పగిస్తే ఏ జైల్లో ఉంచుతారన్న విషయాన్ని తమకు తెలియజేయాల్సిందిగా భారత అధికారవర్గాలను గురువారం బ్రిటన్‌ కోర్టు కోరింది. ఈ విషయాన్ని తమకు 14 రోజుల్లోగా తెలపాలని సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణను జూన్‌ 27కు వాయిదా వేసింది. ఆయనను గురువారం విచారణ అనంతరం తిరిగి జైలుకు తీసుకెళ్లారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/