పేలుళ్లలో భారత్‌ చర్చ..శ్రీలంక చేరిన ఎన్‌ఐఏ బృందం!

Sri Lanka blasts
Sri Lanka blasts

న్యూఢిల్లీ: ఏప్రిల్‌ 21 ఈస్టర్‌ పర్వదినాన శ్రీలంకలో చర్చిలు, విలాలవంత హోటలపై ముష్కరులు ఆత్మాహుతి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. బాంబులకు పాల్పడిన వారు భారత్‌లోని కశ్మీర్‌, కేరళలో శిక్షణ పొందినట్లు తెలుస్తోందని శ్రీలంక పోలీస్‌ చీఫ్ ప్రకటన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ పేలుళ్లలో భారత్‌ ములాలు ఉన్నాయని వార్తలు వస్తున్న కారణంగా ఇద్దరు సభ్యులతో కూడిన జాతీయ దర్యాప్తు (ఎన్‌ఐఏ) బృందం మంగళవారం కొలంబోకు వెళ్లింది. దీనిపై మరింత లోతైన విచారణ జరపడానికి ఎన్ఐఏ బృందం అక్కడి అధికారులతో చర్చలు జరపనుంది. ఈ సమావేశంలో అనుమానిత ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని ఇరు దేశాలు పంచుకోనున్నాయని అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా లంక పోలీసులు అనుమానితుల నుంచి రాబట్టిన ఫోన్‌నెంబర్లు, సామాజిక మాధ్యమాల ఖాతాలు, వ్యక్తుల పేర్లు వంటి కీలక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోనున్నారు. నేషనల్‌ తౌవీద్‌ జమాత్‌ ఉగ్రసంస్థతో తమిళనాడు, కేరళకు చెందిన కొందరు వ్యక్తులకు సంబంధాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో దీనిపై కూడా విస్తృత చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/