24 గంటల్లో మళ్లీ విస్పోటనం చెందే అవకాశం

White island volcano
White island volcano

ఆక్లాండ్‌: రెండు రోజుల క్రితం న్యూజిలాండ్‌లోని వైట్‌ ఐలాండ్‌ అగ్నిపర్వతం విస్పోటనం చెందింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగ దీవిని కప్పేయడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్న విషయం తెలిసిందే. అయితే మరోసారి అగ్నిపర్వతం విస్పోటనం చెందే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ విస్పోటనం మరో 24 గంటల్లోనే జరగుతుందని చెప్పారు. దీంతో సహాయక చర్యల కొనసాగింపునకు అడ్డంకి ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా బుధవారం నాడు అగ్నిపర్వతంలో మళ్లీ కుదుపులను గమనించినట్లు జియోనెట్‌ అధికారులు తెలిపారు. సోమవారం ఏవిధంగా అయితే విస్పోటనం జరిగిందో అదేవిధంగా మరో 24 గంటల్లో అగ్నిపర్వతం పేలే అవకాశం ఉందని చెప్పారు. అయితే దట్టంగా పేరుకుపోయిన పొగ కాస్త క్లియర్‌ అయితే సహాయక చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/