అనారోగ్యంతో నవాజ్‌ షరీఫ్‌..

nawaz sharif
nawaz sharif, former pakistan pm


లాహోర్‌: ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ (69) ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఆయన కుమార్తె మర్యం నవాజ్‌ మీడియాకు తెలిపారు. ఆయన చాలారోజుల నుంచి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు. పాక్‌లోని కోట్‌ లఖ్‌పాట్‌ జైలులో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులతో పాటు ఆమె కలుసుకున్నారు. నవాజ్‌ షరీఫ్‌ వ్యక్తిగత వైద్యుడు అద్నాన్‌ ఖాన్‌, ఆయన ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీశారు.