భారత్‌-సింగపూర్‌ నౌకా విన్యాసాలు

NAVY
NAVY

భారత్‌-సింగపూర్‌ నౌకా విన్యాసాలు

పోర్టుబ్లెయిర్‌ తీరంలో ఆరంభం

విశాఖపట్నం: సింగపూర్‌ -ఇండియా 25వ మేరిటైం ఎక్సర్‌ సైజ్‌ (ఎస్‌ఐఎంబిఇఎక్స్‌) శనివారం ఘనంగా ప్రారంభమయ్యింది. ఈకార్యక్రమం నవం బరు 12 వరకు నిర్వహించనున్నట్టు ఈస్ట్రన్‌ నావల్‌కమాండ్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో భాగంగా సింగపూర్‌కు చెందిన యుద్దనౌకలు, హెలికాఫ్టర్లు అండ మాన్‌ నికోబార్‌దీవులలో గల పోర్టుబ్లెయిర్‌ సముద్రతీర ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ యుద్దనౌకలుకు రిపబ్లిక్‌ అఫ్‌ సింగపూర్‌ నావీకిచెందిన లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ హెచ్‌.ఒ. జీకీన్‌ ప్రాతినిధ్యం వహిస్తుండగా, భారత నావికాదళానికి అడ్మిరల్‌ దినేష్‌ కె.త్రిపాఠి నేతృత్వం వహిస్తున్నారు. వీరిరువురి నేతృత్వంలో సింబెక్స్‌-18 25వ ఎడిషన్‌నునిర్వహించనున్నారు.