చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండింగ్‌ నాసా చిత్రాలు?

Chandrayaan 2 landing site
Chandrayaan 2 landing site

వాషింగ్టన్: చంద్రయాన్2లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై గట్టిగా ఢీకొట్టిందని అమెరికా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. చంద్రయాన్‌2 నుంచి వేరయిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై హార్డ్‌ ల్యాండింగ్‌ చేసిందని ,అందుకు సంబంధించిన హైరిజల్యూషన్‌ ఫొటోలను శుక్రవారం నాసా విడుదల చేసింది. నాసాకు చెందిన లునార్‌ రికనైజాన్స్‌ ఆర్బిటర్‌ కెమెరా చంద్రుడి సమీపంలో తిరుగుతున్న సమయంలో ఈ ఫొటోలను తీసింది. అయితే ఈ ఫోటోలను ఈ నెల 17న తీసినట్లు తెలిపారు. అయితే ఆ పాత్రంలో చీకటిగా ఉండటంతో ల్యాండింగ్ ప్రదేశాన్ని గుర్తించలేకపోయామని శాస్త్రవేత్తలు తెలిపారు.చంద్రుడి దక్షిణ ధ్రువంలో చంద్రయాన్‌2ను సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయాలని ఇస్రో భావించిన సంగతి తెలిసిందే.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/