73కు చేరిన మృతుల సంఖ్య: సోమాలియా

Somalia car bomb
Somalia car bomb

మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషు కేంద్రంగా జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 73కు చేరింది. ఈ ఘటనలో మరో 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే బాంబు పేలిన తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ఘటనలో మృతి చెందిన వారిలో అధికంగా స్థానికంగా ఉన్న యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నట్లు నగర మేయర్‌ మహమూద్‌ తెలిపారు. కాగా ఈ దాడికి ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత వహించలేదు. అయితే అల్‌ఖైదా అనుబంధ సంస్థ అల్‌-షబాబ్‌ ఈ దాడికి యత్నించి ఉండవచ్చునని భావిస్తున్నారు. 2017 అక్టోబరులో అల్‌-షబాబ్‌ జరిపిన ట్రక్కు బాంబు పేలుడులో 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/