బెల్జియం పర్యటన రద్దు

భారత – యూరోపియన్‌ యూనియన్‌ సదస్సు వాయిదా

Modi cancels tour of Belgium

New Delhi: ప్రధాని నరేంద్ర మోడీ ఈనెలలో పర్యటించాల్సిన బెల్జియం పర్యటన రద్దయ్యింది. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఈ నెలలో జరగాల్సిన భారత – యూరోపియన్‌ యూనియన్‌ సదస్సు వాయిదా పడింది.

కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఈ సదస్సును వాయిదా వేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ బెల్జియం పర్యటన రద్దు అయినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్‌ వెల్లడించారు.

కరోనా వ్యాప్తి చెందుతుండడంతో.. కొన్ని రోజుల పాటు పర్యటనలు వాయిదా వేసుకోవాలని రెండు దేశాల ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/