సెనేటర్‌ జాన్‌ కార్నిన్‌ భార్యకు మోడీ క్షమాపణల వీడియో

Modi Apologises to senator John cornyn's Wife
Modi Apologises to senator John cornyn’s Wife

Houston: ప్రధాని మోడీ అమెరికా సెనేటర్‌ జాన్‌ కార్నిన్‌ సతీమణికి క్షమాపణలు చెప్పారు. ఆదివారం సెనేటర్‌ సతీమణి జన్మదినం. అయితే హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొనడానికి జాన్‌ కార్నిన్‌ రావడం వల్ల తన భార్య పుట్టిన రోజునాడు ఆమెతో గడుపలేకపోయా రు. దీనితో మోడీ వీడియోలో షష్టిపూర్తి చేసుకున్న ఆమెకు నేరుగా క్షమాపణలు చెబుతూ ఆ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. ఆ సమయంలో 67 ఏళ్ల జాన్‌ కార్నిన్‌ నవ్వుతూ మోడీ పక్కనే నిలబడ్డారు.