భారత్‌కు మద్దతిచ్చే దేశాలపై క్షిపణి దాడులు

పాక్‌ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

ali ameen
ali ameen

ఇస్లామాబాద్‌: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తరువాత పాకిస్తాన్‌ భారత్‌పై అవకాశం దొరికితే చాలు విషం చిమ్మాలని చూస్తున్నది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను నిందించడమే పనిగా పెట్టుకున్నది. పాకిస్థాన్‌ ప్రభుత్వంలోని మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారారు. ఈ నేపథ్యంలో భారత్‌కు మద్దతు ఇచ్చే దేశాలపై క్షిపణి దాడులు చేస్తాం అంటూ పాకిస్థాన్‌ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ఒకరు అణుయుద్ధం అన్నారు. మరొకరు భారత్‌ను ధ్వంసం చేస్తామన్నారు. ఇప్పుడు క్షిపణి దాడులు అంటున్నారు. ఇలా రోజుకోరకంగా భారత్‌పై పాక్‌ మంత్రులు తమ అక్కసు ప్రదర్శిస్తున్నారు. కాశ్మీర్‌ విషయంలో పరిస్థితులు చేదాటి పోతే భారత్‌పై యుద్ధానికి దిగడం తప్ప పాక్‌కు మర దారి లేదన్న మంత్రి అలా అమీన్‌ ఆ సమయంలో భారత్‌కు అండగా నిలిచే దేశాలపై కూడా క్షిపణి దాడులు చేస్తామని హెచ్చరించారు. మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పాక్‌ జర్నలిస్టు నైల ఇనాయత్‌ పోస్టు చేశారు.
తాజా చెలి కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/specials/women/