పాకిస్ధాన్‌లో పెట్రోల్‌కు మించిన పాల రేటు!

milk
milk


ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో మొహరం సందర్భంగా ప్రధాన నగరాల్లో లీటర్‌ పాల ధర అనుహ్యూంగా పెరిగింది. సింధ్‌ ప్రావిన్స్‌, కరాచీలలో లీటర్‌ పెట్రోల్‌ ధర కన్నా లీటర్‌ పాల ధర రూ.140కి చేరిందన్నారు. సాధారణంగా తరచుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుంటాయి. పాకిస్థాన్‌లో రెండు రోజుల క్రితం లీటర్‌ పెట్రోల్‌ రూ.113 ఉండగా, డీజిల్‌ రూ.91 అమ్ముతున్నారు. అయితే పాలు మాత్రం లీటర్‌ 140 రూపాయలకు చేరిందని అక్కడివారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీటర్‌కు రూ.140కి పెరిగిన పాల ధర సింధ్‌ లోని కొన్ని ప్రాంతాలలో ఉందన్నారు. కరాచీలో పాలు లీటర్‌కు 120 చొప్పున ఉందని, అకస్మాత్తుగా లీటర్‌కు రూ.140 పెరిగిందని స్థానిక దుకాణాదారు ఒకరు అన్నారు. మొహరం సందర్భంగా వివిధ స్టాళ్లలో పాలు, పళ్లరసాలు, చల్లటి మంచినీళ్లు అమ్ముతుంటారని, పాలకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని అందుకే పాల ధర ఈ విధంగా పెరిగిందంటున్నారు. పండుగల సందర్భంగా ప్రతి యేడు పాలధర పెరగడం సాధారణమే అయినప్పటికి ఇంత స్థాయిలో పెరగడం నా జీవితంలో ఇప్పుడే చూస్తున్నంటూ స్థానికులంటున్నారు. పెరిగిన పాల ధరపై కరాచి కమిషనర్‌ ఇఫ్తికార్‌ షాల్వానిని ప్రశ్నించగా కమిషనర్‌ కార్యాలయంలో లీటర్‌ పాలు రూ.94 ఉన్నాయని చెప్పారు.
 తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/international-news/