మెలానియా ట్రంప్‌ విగ్రహం ధ్వంసం

Melania Trump Statue Set On Fire Near Her Hometown In Slovenia

స్లొవేనియా: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భార్య మెలానియా ట్రంప్‌ స్వస్థలం స్లొవేనియాలో ఏర్పాటైన ఆమె విగ్రహానికి కొందరు నిప్పు పెట్టారు.  జులై 4న అమెరికన్లు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్న రోజునే చెక్కతో తయారైన మెలానియా విగ్రహానికి నిప్పంటించారని ఈ విగ్రహం రూపొందించిన కళాకారుడు  ఆర్టిస్ట్ బ్రాడ్ డౌనీ వెల్లడించారు. జులై 5న డౌనీ పోలీసుల‌కు ఫిర్యాదు చేసి విగ్ర‌హాన్ని తొల‌గించారు. డౌనీ ఫిర్యాదుపై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. ద‌ర్యాప్తు పూర్తి కానందున వివ‌రాలు వెల్ల‌డించ‌లేమ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. మెలానియా ట్రంప్ విగ్ర‌హం ధ్వంసం ఘ‌ట‌న‌పై వాషింగ్ట‌న్ లోని మెలానియా కార్యాల‌యం ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు. ఇక డొనాల్డ్ ట్రంప్ చెక్క విగ్ర‌హాన్ని ఈ ఏడాది జ‌న‌వ‌రిలో దుండ‌గులు ద‌గ్ధం చేసిన విష‌యం తెలిసిందే.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/

One thought on “మెలానియా ట్రంప్‌ విగ్రహం ధ్వంసం

Comments are closed.