విద్యార్ధిని మృతిపై పాక్‌లో భగ్గుమన్న నిరసనలు

hindus in pak
hindus in pak

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లోని లర్కానా ప్రాంతంలో హిందూ వైద్య విద్యార్ధిని నమ్రితా చందాని అనుమానాస్పద మృతిపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనను నిరసిస్తూ పెద్ద సంఖ్యలో ప్రజలు కరాచీ వీధుల్లో ఆందోళన చేపట్టారు.లర్కానాలోని బబీ అసిఫా డెంటల్‌ కాలేజీలోని తన హాస్టల్‌ గదిలో నమ్రితా అనుమానాస్పద స్ధితిలో విగతజీవిగా పడిఉన్నారు. తొలుత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అనుమానించినా పోలీసులు భిన్న కోణాల్లో విచారణ చేపట్టారు. మరోవైపు విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆమె బలవన్మరణానికి పాల్పడలేదని, ఆమెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. తన సోదరి ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురైందని బాధితురాలి సోదరుడు డాక్టర్‌ విశాల్‌ సుందర్‌ పేర్కొన్నారు.