ట్రంప్‌తో జుకర్‌బర్గ్‌ భేటీ

trump and zuckerberg
trump and zuckerberg


వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌తో ఫేస్‌బుక్‌ సిఇవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ భేటీ అయ్యారు. వీరు కలుసుకున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రంప్‌ పోస్ట్‌ చేశారు. ఇటీవల కాలంలో దిగ్గజ కంపెనీ కొన్ని వివాదాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జుకర్‌బర్గ్‌ భేటీలో సామాజిక మాధ్యమాల పోటీ, డిజిటల్‌ గోప్యత, సెన్సార్‌షిప్‌, రాజకీయ ప్రకటనలలో పారదర్శకత వంటి సమస్యలపై చర్చలు జరిగినట్లుగా వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/