నేడు మాల్యా పిటిషన్‌పై విచారణ

Vijay Mallya
Vijay Mallya

లండన్‌: బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి, బ్రిటన్ కు పారిపోయి తలదాచుకున్న యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాను తిరిగి ఇండియాకు తీసుకువచ్చే విషయం తిరిగి యూకే కోర్టుకు చేరింది. ఇప్పటికే, మాల్యాను ఇండియాకు అప్పగించాలని వెస్ట్ మినిస్టర్స్ కోర్టు తీర్పివ్వగా, యూకే హోమ్ సెక్రటరీ సాజిద్ జావిద్ సైతం అందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. అయితే, తన అప్పగింత నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు అనుమతించాలని కోరుతూ మాల్యా మరోమారు కోర్టును ఆశ్రయించారు. కాగా ఈరోజు మాల్యా పిటిషన్ విచారణకు రానుండగా ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్, మాల్యాను అప్పగించడమా? లేక లండన్ లోనే విచారించడమా? అన్న విషయమై వాదనలు విని, తీర్పివ్వనుంది. ఒకవేళ మాల్యాను ఇండియాకు పంపాలన్న నిర్ణయమే వస్తే, 28 రోజుల్లోగా ఇండియాకు తరలిస్తారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/