అందరి అప్పులు తిరిగిచ్చేస్తాను

Vijay Mallya
Vijay Mallya

లండన్‌: స్‌బీఐ సహా పలు బ్యాంకులకు వేల కోట్ల రుణాలుమోసం చేసి లండన్‌ పారిపోయిన విజయ్‌ మాల్యా సీబీఐపై మరోసారి విమర్శలు చేశారు.దేవుడు చాలా గొప్పవాడు. నాకు న్యాయం జరిగింది. భారత్‌కు అప్పగించే విషయమై గతంలో ఇచ్చిన తీర్పును సవాల్‌ చేసేందుకు ఇంగ్లీష్‌ హైకోర్టు అనుమతి ఇచ్చింది. నాపై తప్పుడు కేసులు పెట్టారని పదేపదే చెబుతూనే ఉన్నా. అయితే కోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ.. బ్యాంకులకు నా ఆఫర్‌ గురించి మళ్లీ గుర్తుచేస్తున్నా. కింగ్‌ పిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణాలన్నీ తీర్చేస్తా. దయచేసి ఆ డబ్బు తీసుకోండి. మిగిలిన దాంతో ఉద్యోగులకు జీతాలు ఇస్తా. అప్పులిచ్చిన ఇతరులకు తిరిగిచ్చేస్తా. జీవితంలో ముందుకు సాగుతా. నన్ను ఎంతోమంది హేళన చేశారు. ఇంగ్లాండ్‌ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును వారంతా గమనించాలి అని మాల్యా ట్విటర్‌ వేదికగా ఆరోపణలు చేశారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/