యామ్‌ప్లస్‌ ఎనర్జీ కొనుగోలుకు పెట్రోనాస్‌ ఆసక్తి

Malaysia's Petronas
Malaysia’s Petronas


ముంబై: భారత్‌కు చెందిన రూఫ్‌టాప్‌ సోలార్‌ పవర్‌ కంపెనీ యామ్‌ప్లస్‌ ఎనర్జీని కొనుగోలు చేసేందుకు మలేషియా ప్రభుత్వరంగ దిగ్గజ సంస్థ పెట్రోలియం నసియోనాల్‌ బెర్హాడ్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఈ విషయాన్ని సోమవారం పెట్రోనాస్‌ వెల్లడించింది. ఈ డీల్‌ విలువ రూ. 2,700 కోట్లుగా అంచనా వేస్తున్నారు. పెట్రోనాస్‌ కాలుష్య రహిత ఇంధన విభాగంలో అడుగుపెట్టాలనుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. న్యూయార్క్‌కు చెందిన ఐ స్వ్కార్డ్‌ కేపిటల్‌కు యామ్‌ప్లస్‌లో దాదాపు 90 శాతం వాటాలున్నాయి. మిగిలిన పది శాతం షేర్లు యామ్‌ప్లస్‌ వ్యవస్ధాపకుడు ,ఎండి సంజీవ్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని నిర్వహణ బృందానికి ఉన్నాయి. యామ్‌ప్లస్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌లో నూరుశాతం వాటాలను కొనుగోలు చేయనుంది. ఈ సంస్థ ఆసియాలో రెన్యూవబుల్‌ ఎనర్జీ ఆస్తులను విక్రయిస్తుందని పెట్రోనాస్‌ వెల్లడించింది.
రష్యాకు చెందిన ఓఏఓ రుస్‌నెఫ్ట్‌ కూడా భారత్‌లోని సోలార్‌ ఎనర్జీ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/