జకీర్‌ ప్రసంగాల్ని నిషేధించిన మలేషియా ప్రభుత్వం

Zakir Naik
Zakir Naik

కౌలాలంపూర్‌: మలేషియా ప్రభుత్వం మత ప్రచారకుడు జకీర్‌ నాయక్‌ బహిరంగ సమావేశాలను నిషేధించింది. అతడు ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న అభియోగాల కింద సోమవారం అక్కడి పోలీసులు ఆయన్ని విచారించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు వర్గాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కొంతమంది జకీర్‌పై అక్కడి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని వారు ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం ఆయనపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉందని భావించిన అక్కడి అధికారులు ఆయన బహిరంగ సభల్ని నిషేధించారు. ఈ విషయాన్ని ద రాయల్‌ మలేషియా పోలీస్‌ కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ చీఫ్‌ అస్మావతి అహ్మద్‌ వెల్లడించారు. తాను చేసిన వ్యాఖ్యలకు జకీర్‌ నాయక్‌ క్షమాపణలు కోరారు. తాను ఎవరినీ కించపరచాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని.. కావాలనే కొంతమంది తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/