నాసా తాజా చిత్రాల్లోనూ కనిపించని ‘విక్రమ్’

ఇన్నిరోజులైనా ఎక్కడ ఉందో తేలని వైనం

Vikram-Lander
Vikram-Lander

వాషింగ్టన్‌: చంద్రయాన్‌2లో భాగంగా భారత శాస్త్రవేత్తలు జాబిల్లిపై పరిశోధనల కోసం ప్రతిష్టాత్మకంగా పంపిన ‘విక్రమ్‌’  ల్యాండర్‌ జాడ చిక్కలేదు. తొలి లూనార్‌ డే సమయంలో పలు చిత్రాలు తీసిన నాసా జాడ కనిపించలేదని ప్రకటించింది. తాజా లూనార్‌ డే సందర్భంగా నాసాకు చెందిన లూనార్‌ రికానసెన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌ఓ) ఈనెల 14న కూడా పలు ఫొటోలు తీసింది.

అయితే, ఈ ఫొటోల్లోనూ విక్రమ్‌ కనిపించలేదని ప్రకటించడంతో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. ఖఅక్షాంశం తక్కువగా ఉండడం వల్ల ల్యాండర్‌ దిగిందని భావిస్తున్న ప్రాంతంలో ఎప్పుడూ నీడ ఉంటుంది. ఆ నీడలోనైనా ల్యాండర్‌ ఉండాలి. లేదా నిర్దేశించిన ప్రాంతానికి అవతల అయినా ఉండొచ్చుగ అని ఎల్‌ఆర్‌ఓ డిప్యూటీ ప్రాజెక్టు సైంటిస్ట్‌ జాన్‌కెల్లర్‌ తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/