కువైట్ వెళ్లేవారికి ఆ సర్టిఫికెట్‌ తప్పనిసరి

kuwait

కువైట్‌: కువైట్ వచ్చే ప్రతిఒక్కరికీ పీసీఆర్ టెస్టు సర్టిఫికేట్ తప్పనిసరి అని అక్కడి అధికారులు వెల్లడించారు. విమానాశ్రయంలో చేసే స్వాబ్ టెస్టు, 14 రోజుల క్వారంటైన్‌ కాకుండా పీసీఆర్ టెస్టు సర్టిఫికేట్ కూడా తప్పనిసరి అని ప్రభుత్వ అధికార ప్రతినిధి తారిఖ్ అల్ ముజ్రిమ్ తెలిపారు. అలాగే కువైట్ ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న కొవిడ్ నిబంధనలు ఉల్లఘించే వారిని కూడా దేశంలో ప్రవేశించడాన్ని అనుమతించబోమని ఆయన పేర్కొన్నారు. అరబ్ కమ్యూనిటీకి చెందిన వారు ఎవరైతే పొరుగు దేశాల్లో చిక్కుకున్నారో వారికి కొవిడ్ నిబంధనల నుంచి మినహాయింపు ఉన్నట్లు మీడియాలో వచ్చిన కథనాలను అధికారి ఖండించారు. అలాంటి మినహాయింపులేమి లేవని, అందరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని తారిఖ్ అల్ ముజ్రిమ్ స్పష్టం చేశారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/