రెఫరెండం 2020 బోగస్‌ వ్యవహారం

అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్‌ ష్రింగ్లా

indian embassy

న్యూఢిల్లీ: ఖలిస్థాన్‌ ఒక ముగిసిన అంశమని దానికోసం కొందరు ఉగ్రవాదచర్యలకు పూనుకుంటున్నారని అమెరికాలోని భారతరాయబారి హర్షవర్ధన్‌ ష్రింగ్లా అన్నారు. ఇది సరికాదని, దీనికి మద్దతిస్తున్న వారిని పాకిస్థాన్‌ ఏజెంట్లుగా ఆయన అభివర్ణించారు. భారత్‌లో వేర్పాటువాదానికి పాకిస్థాన్‌ మద్దతు పలుకుతుందని కూడా అన్నారు. అమెరికాలోని సిక్కులు నిర్వహించిన కార్యక్రమంలో హర్షవర్ధన్‌ ష్రింగ్లా ఈ విధంగా మాట్లాడారు. ఖలిస్థాన్‌ కోసం రెఫరెండం 2020 పేరిట జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ బోగస్‌ వ్యవహారమని, ఇందుకు కొంత మంది మాత్రమే మద్దతు పలుకుతున్నారని ఆయన అన్నారు. అయితే రెఫరెండం 2020 పై ఒక దౌత్యవేత్త ఈ విధంగా స్పందించడం ఇదే మొదటిసారి. అమెరికా, భారత్‌ మధ్య సంబంధాల్ని బలోపేతం చేయడంలో సిక్కు, వర్గం కీలకంగా వ్యవహరిస్తోందని, సిక్కుల్లో అత్యధికులు భారత్‌కు మద్దతుగా ఉన్నారని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వేర్పాటువాదం పేరుతో దేశంలో ఆందోళనలు కలిగించాలనుకుంటున్నవారిని ప్రజలు క్షమించరన్నారు. నవంబర్‌ 12న గురునానక్‌ దేవ్‌ 550వ జయంతిని జరిపేందుకు భారత దౌత్యకార్యాలయం ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా అక్కడి సిక్కుల నేత జస్సీసింగ్‌ మాట్లాడుతూ రెఫరెండం 2020కి మెజారిటీ వర్గాల మద్దలు లేదని,ఏవైనా సమస్యలుంటే భారత ప్రభుత్వంతో చర్చించి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/