ఆఫ్ఘన్‌ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు మృతి

encounter
encounter

ఆఫ్ఘనిస్తాన్‌లోని బాల్ఖ్‌ ప్రావిన్స్‌లో గురువారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో తాలిబన్‌ గ్రూప్స్‌కు చెందిన కీలక నాయకుడితో పాటు మరో ఐదుగురు హతమయ్యారు. బాల్ఖ్‌ ప్రావిన్స్‌లో ఉగ్రవాదాలు ఉన్నట్లు ఆఫ్ఘన్‌ నేషనల్‌ డిఫెన్స్‌ మరియు సెక్యూరిటీ ఫోర్సెస్‌కు సమాచారం అందింది. దీంతో అక్కడ బలగాలు కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకోగా ఆరుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. మృతుల్లో ఉగ్రవాద కీలక నాయకుడు ముల్లాహ్‌ షాదర్‌ ఉన్నట్లు బలగాలు కొనసాగుతూనే ఉన్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/