కెనడా ప్రధానమంత్రి భార్యకు కరోనా

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోరీకి కరోనా వైరస్‌

Canadian PM Justin Trudeau's wife, Sophie
Canadian PM Justin Trudeau’s wife, Sophie

ఒట్టావా: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కకాలవికలం చేస్తుంది. మనుషుల దగ్గరి నుండి మార్కెట్ల దాకా దేని వదలడం లేదు. తాజాగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో భార్య సోఫీ గ్రిగోయిర్ ట్రుడోకు కరోనావైరస్ సోకిందని తేలింది. బ్రిటన్ దేశ పర్యటనకు వెళ్లి వచ్చిన సోఫీ గ్రిగోయిర్ ట్రుడోకు ఫ్లూ లక్షణాలు కనిపించడంతో ఆమెను పరీక్షించగా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో సోఫీ గ్రిగోయిర్ ట్రుడోను స్వయం ఐసోలేషన్ గదికి తరలించారు. ‘గురువారం రాత్రి నా భార్య సోఫీ గ్రిగోయిర్ కు జ్వరంగా అనిపించడంతో ఆమెకు వైద్యపరీక్షలు చేయించగా కరోనా వైరస్ పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. దీంతో వైద్యుల సలహాపై ఐసోలేషన్ గదిలో ఉండి చికిత్స పొందుతోంది.’ అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో చెప్పారు. తన భార్యకు కరోనా వైరస్ సోకడంతో తాను ముందుజాగ్రత్త చర్యగా ఇంటి నుంచే పనిచేస్తున్నానని కెనడా ప్రధాని ట్రుడో ప్రకటించారు.ఫోన్ కాల్స్, సమావేశాలను అన్నీ ఆన్ లైన్ లోనే వర్క్ ఫ్రం హోం చేస్తున్నానని ట్రుడో చెప్పారు. శుక్రవారం ఒట్టావాలో జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేశానని, వారితో ఫోన్ లో సంప్రదిస్తానని ప్రధాని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/