అమెరికా సుప్రీంకోర్టు జ‌డ్జి గిన్స్‌బ‌ర్గ్ క‌న్నుమూత‌

Justice Ruth Bader Ginsburg

అమెరికా: అమెరికా సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి రూత్ బాడ‌ర్ గిన్స్‌బ‌ర్గ్ (87) క‌న్నుమూశారు. మ‌హిళా హ‌క్కుల పోరాట యోధురాలిగా ఆమెకు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ది. ప్యాంక్రియాట్రిక్ క్యాన్స‌ర్ వ‌ల్ల మృతిచెందిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. అమెరికాలో ప్ర‌ఖ్యాత ఫెమినిస్ట్‌గా ఆమెను గుర్తిస్తారు. అగ్ర‌రాజ్య సుప్రీంకోర్టులో జ‌డ్జి‌గా చేరిన రెండ‌వ మ‌హిళ ఆమె. 27 ఏళ్ల పాటు సుప్రీంకోర్టులో రూత్ తీర్పులిచ్చారు. జ‌స్టిస్ గిన్స్‌బ‌ర్గ్ మృతి ప‌ట్ల అధ్య‌క్షుడు ట్రంప్ నివాళి అర్పించారు. ఆమె స్థానంలో కొత్త న్యాయ‌మూర్తిని ట్రంప్ నియ‌మించే అవ‌కాశాలు ఉన్నాయి. అద్భుత‌మైన జీవితాన్ని కొన‌సాగించింద‌ని, అంత‌క‌న్నా చెప్పేదేముంటుంద‌న్నారు. చ‌ట్టాల రూప‌క‌ల్ప‌న‌లో గిన్స్‌బ‌ర్గ్ ఓ మేటీ న్యాయ‌మూర్తి అని అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/