ఇండోనేషియా అధ్యక్షుడిగా జోకో విడోడో

Joko Widodo
Joko Widodo

జకార్త: ఇండోనేషియా అధ్యక్షుడిగా జోకో విడోడో మరోసారి ఎన్నికయ్యారు. మంగళవారం విడోడో గెలుపొందినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఎన్నికల్లో తమను మోసం చేశారని ఆరోపిస్తూ ప్రత్యర్థి ప్రబోవో సుబియాంటో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అందువల్ల అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నందున ఎన్నికల సంఘం కొంచెం ఆలస్యంగా ఫలితాలను విడుదల చేసింది. ఉగ్రకార్యకలాపాలతో సంబంధాలున్నాయని పదుల సంఖ్యలో అనుమానితుల్ని అదుపులోకి తీసుకొన్నామని పోలీసులు చెప్పారు. ఇండోనేషియాలో అధ్యక్షుడి ఎన్నికలు గతనెల 17న జరిగాయి.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/