న్యూజెర్సీలో కాల్పుల్లో ఆరుగురు మృతి

new jersey police
new jersey police

న్యూజెర్సీ: అమెరికాలో రెక్కలు విప్పిన తుపాకీ విష సంస్కృతికి ఆరుగురు ప్రాణాలు వదిలారు. ట్రక్కులో వచ్చిన దుండగులు జెర్సీ నగరంలోని ఓ నిత్యావసరాల దుకాణంలో ఒక్కసారిగా కాల్పులు జరిపారు. విషయం తెలుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా వారిపై కూడా ముష్కరులు కాల్పులు జరిపారు. కాగా ఈ దాడిలో ఆరుగురు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. అందులో ముగ్గురు సాధారణ పౌరులు, ఇద్దరు నిందితులు సహా ఒక పోలీసు ఉన్నతాధికారి మరణించినట్లు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో స్థానిక దుకాణాలు, పాఠశాలలు మూసివేశారు. ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ.. దీనిని ఒక భయంకరమైన ఘటనగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, తక్షణ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఈ ఘటనలో చనిపోయిన పోలీసు అధికారి గతంలో తుపాకీ విష సంస్కృతి నిర్మూలనకు కృషి చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/