జపాన్‌ ప్రధాని విమానం అమ్మకానికి

Japanese Air Force
Japanese Air Force

జపాన్‌: జపాన్‌ ప్రధాని విమానం అమ్మకానికి వచ్చినట్లు సీఎస్డీఎస్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ కీలక ప్రకటన చేసింది. జపాన్ ప్రధానులు విదేశాలకు రాకపోకలు సాగించేందుకు ఉద్దేశించిన ఎయిర్ ఫోర్స్ వన్ బోయింగ్ 747400 విమానం అమ్మకానికి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ విమానంలో ఇప్పటివరకూ 14 మంది జపాన్ ప్రధానమంత్రులు ప్రయాణించారని వెల్లడించింది. 1991లో తయారైన ఈ బోయింగ్ విమానం ఇప్పటివరకూ కేవలం 16,332 గంటలు మాత్రమే గాల్లో విహరించిందని పేర్కొంది. ఇందులో 80 మంది ప్రయాణికులు ఒకేసారి ఎక్కడికైనా వెళ్లవచ్చని చెప్పింది. ఈ విమానంలో బెడ్రూమ్, స్నానాల గది, కార్యాలయం, లాంజ్ ఏరియా వంటి సౌకర్యాలు ఉన్నాయని సీఎస్డీఎస్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ తెలిపింది. అయితే ఈ విమానం ధర రూ.199.65 కోట్లు మాత్రమే.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/