వైట్‌ హౌస్‌ను వీడనున్న ఇవాంకా?

సూచన ప్రాయంగా చెప్పిన ట్రంప్‌ కుమార్తె

Ivanka Trump
Ivanka Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి గెలిస్తే ఆయన కూతురు ఇవాంకా ట్రంప్‌ వైట్‌హౌస్‌లోనే ఉంటారా అన్న అనేక ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఓ మీడియాకు ఇవాంకా ఇచ్చిన ఇంటర్యూలో ట్రంప్‌ ఎన్నికల్లో గెలిస్తే తండ్రికి సలహాదారుగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించగా. అందుకు సమాధానంగా తన పిల్లలు, వారి సంతోషమే నాకు ప్రాధాన్యం అంది. వారి అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగానే నా నిర్ణయాలు ఉంటాయని ఆమె అన్నారు. తన పదవీ కాలంలో అనేక వర్గాలకు సేవలందిచానని ఇవాంకా తెలిపారు. అయితే భవిష్యత్తులో అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందా అని అడగగా నిజాయితీగా చెప్పాలంటే నాకు రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/