ఉగ్రవాద సంస్థలతో పాక్‌ ఐఎస్‌ఐ కీలక భేటి!

హాజరైన పలు ఉగ్రవాద సంస్థలు

ISI
ISI

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్ఐ, ఉగ్ర సంస్థలతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఖలిస్థానీ జిందాబాద్ ఫోర్స్ తదితర సంస్థలు హాజరయ్యాయని సమాచారం. ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో, ఏ క్షణమైనా భారత్ పై ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఐఎస్ఐ నిర్వహించిన సమావేశంపై కీలక వివరాలు సేకరించిన ఇంటెలిజెన్స్, ఈ సమావేశంలో భారత్ పై ఎలా దాడులు చేయాలన్న విషయంపైనే చర్చ జరిగిందని వెల్లడించింది. ఇస్లామాబాద్ లోని ఓ రహస్య ప్రదేశంలో మీటింగ్ జరిగిందని పేర్కొంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/