ఇరాక్‌లో తొలి కరోనా మృతి

First Coronavirus death in Iraq
First Coronavirus death in Iraq

ఇరాక్: ఇరాక్‌లో కరోనాతో ఒకరు మృతి చెందారు. 70 ఏళ్ల‌ వ్యక్తి కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా అతనికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ రోగిని సులైమనియాలోని ఈశాన్య ప్రాంతంలో నిర్బంధించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు విడిచారు. దేశంలో ఇదే తొలి కరోనా మరణమని ఇరాక్‌ పభుత్వం ప్రకటించింది. కాగా.. ఇరాక్‌లో ఇప్పటి వరకు 32 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే ఐదుగురు వ్యక్తులకు వ్యాధి నిర్ధారణ అయినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. అందులో కొంతమంది ఇటీవల ఇరాన్‌ నుంచి వచ్చినట్లు తెలిపింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/