తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఇరాన్‌లో విమానం క్రాష్‌ లాండింగ్‌

Iranian aircraft
Iranian aircraft

టెహ్రాన్‌: ఇరాన్‌లో 144 మంది ప్రయాణీకులతో ఖుజెస్తాన్‌ ప్రావిన్షియల్‌ రాజధాని మహషర్‌ పట్టణానికి బయల్దేరిన విమానం రన్‌వే నుండి పక్కకు జారి విమానాశ్రయం పక్కనున్న ప్రధాన రహదారిపై క్రాష్‌లాండింగ్‌ అయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు అధికారులు చెప్పారు. టేకాఫ్‌ చేస్తున్న విమానం క్రాష్‌లాండింగ్‌ కావటంతో అందులోని ప్రయాణీకులు షాక్‌కు గురయ్యారు. ‘విమానం క్రాష్‌ అయింది… కానీ ఎవరూ గాయపడలేదు…’ అంటూ ఒక ప్రయాణీకుడు వ్యాఖ్యానించారు. విమానంలోని ప్రయాణీకులందరూ క్షేమంగానే వున్నారని విమానాశ్రయ డైరెక్టర్‌ మహ్మద్‌ రజా రజానియన్‌ చెప్పారు. విమానంలో 136 మంది ప్రయాణీకులు, ఎనిమిది మంది సిబ్బంది వున్నారని అధికారులు చెప్పారు. ఈ క్రాష్‌ లాండింగ్‌తో తృటిలో ఘోర ప్రమాదం తప్పిపోయిందన్నారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/