ఇరాన్‌లో 17మంది అమెరికా గూఢచారులు అరెస్టు!

arrested
arrested

దుబాయి: ఇరాన్‌లో అమెరికాకు చెందిన గూఢచారి సంస్థ సీఐఏ తరపున పనిచేస్తున్న 17 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు ఇరాన్ ఇంటిలిజెన్స్‌ విభాగం వెల్లడించినట్లు ఫార్స్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. అరెస్టు అయిన వారిలో కొందరికి ఉరిశిక్ష పడినట్లు అధికారులు పేర్కొన్నట్లు వెల్లడించింది. మేలో ఇరాన్‌ మీద అమెరికా ఆంక్షలను తీవ్రతరం చేసిన దగ్గరి నుంచి పాశ్చాత్య దేశాలకు, ఇరాన్‌కు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌ నుంచి అరెస్టుల ప్రకటన వెలువడింది. సముద్ర జలాల నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలతో గతవారం హార్ముజ్‌ జలసంధి వద్ద ఇరాన్‌ బ్రిటీష్ ట్యాంకర్‌ను ఇరాన్‌ అదుపులోకి తీసుకుంది. ఆ నౌకలో భారతీయ సిబ్బంది కూడా ఉన్నారు. జులై 4న జిబ్రాల్టర్‌ తీరం వద్ద బ్రిటన్‌కు చెందిన రాయల్ మెరైన్స్‌ ఇరాన్‌ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రతీకారంగా ఈ చర్య చేపట్టింది.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/