సంచలన నిర్ణయం తీసుకున్న ఇరాన్‌

అణు ఒప్పందంలోని భాగస్వామ్య దేశాలు విచారం

Iran rolls back nuclear deal commitments
Iran rolls back nuclear deal commitments

టెహ్రాన్‌: ఇరాన్‌ అమెరికాతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. యురేనియం శుద్ధిలో కీలక పాత్ర పోషించే సెంట్రిఫ్యూజ్‌ల సంఖ్యపై ఉన్న పరిమితిని పక్కన పెడుతున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. అంతేకాకుండా యురేనియం నిల్వలు, వాటి శుద్ధి స్థాయిని కూడా పెంచుకున్నట్లు ప్రకటించింది. తమకు ఇకనుంచి అణు కార్యక్రమంపై ఎలాంటి పరిమితులు లేవని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఇరాన్‌ అణు ఒప్పందం నుంచి పూర్తిగా బయట పడింది. అయితే ఈ తదితర అంశాల్లో ఎలాంటి పరిమితులు లేనట్లే తెలస్తుంది. కానీ ప్రస్తుతానికి విద్యుత్తు ఉత్పత్తి వంటి దేశ సాంకేతిక అవసరాల కోసం మాత్రమే తమ దేశంలో అణు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపింది. అలాగే అంతర్జాతీయ అణుశక్తి సంఘం(ఐఏఈఏ)తోనూ తమ సహకారం కొనసాగుతుందని ఇరాన్‌ వెల్లడించింది. కాగా ఇరాన్‌ నిర్ణయాన్ని ఈ ఒప్పందంలో భాగస్వామ్య దేశాలైన ఫ్రాన్స్‌, జర్మనీ, చైనా, బ్రిటన్‌ విచారం వ్యక్తం చేశాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల చక్కదిద్దేందుకు కృషి చేస్తామని జర్మనీ అధికార ప్రతినిధి వెల్లడించారు. అంతేకాకుండా ఇరాన్‌ తీసుకున్న కీలక నిర్ణయం పై ఐక్యరాజ్య సమితి సైతం స్పందించింది. ఇరాన్‌ విదేశాంగ మంత్రితో ఈ అంశంపై మరింత లోతుగా చర్చిస్తామని తెలిపింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/