ఇరాన్‌ దేశాన్ని హెచ్చరించిన ట్రంప్‌

ఇరాన్‌..జాగ్రత్తగా ఉంటే మంచిది

Trump and Rouhani
Trump and Rouhani

న్యూజెర్సీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై అగ్రహం వ్యక్తం చేశారు. అణు ఒప్పందాన్ని ఉల్లఘిస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించడంపై ”జాగ్రత్తగా ఉండాలి” అంటూ ఆ దేశాన్ని ట్రంప్‌ హెచ్చరించారు. న్యూజెర్సీలో విలేకర్లతో ట్రంప్‌ మాట్లాడుతూ ఇరాన్‌.. జాగ్రత్తగా ఉండడం మంచింది. మీరు యురేనియం శుద్ధి చేయడానికి ఓ కారణం ఉంది, అదేంటనేది నేను ఇప్పుడు చెప్పను. కానీ అది మంచిది కాదు. జాగ్రత్తగా ఉండండి అని అన్నారు. అంతకుముందు అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ.. అణు ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లయితే దానికి బదులుగా ఇరాన్ మరిన్ని కఠిన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/